వారఫలాలు ( సౌరమానం) ఆగస్టు 11 నుంచి 17  వరకు

మేషం : యత్నకార్యసిద్ధి. కొన్ని కార్యాలు శ్రమానంతరం పూర్తి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. బంధువులను కలుసుకుని చర్చలు జరుపుతారు. రాబడి సంతృప్తికరం. అయితే అప్పుల బాధలు తప్పవు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు కొత్త  పదవీయోగం. 

వృషభం : చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన కార్యాల్లో పురోగతి. ఆదాయం తగ్గినా అవసరాలకు లోటుండదు. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారులు పెట్టుబడులు సమీకరించుకుంటారు. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు, విదేశీ పర్యటనలు.  

మిథునం : అప్రయత్న కార్యసిద్ధి. ప్రముఖ వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. రాబడి సంతృప్తికరం. అవసరాలకు లోటు రాదు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు,  లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ప్రోత్సాహం. రాజకీయవేత్తలకు విదేశీయానం. 

కర్కాటకం : రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని గతం గుర్తుకు తెచ్చుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి విషయంలో నూతన అగ్రిమెంట్లు. వాహనసౌఖ్యం. నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.  వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఒక కీలక సమాచారం అందుతుంది. కళాకారులకు ఆహ్వానాలు. 

సింహం : కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న కార్యాలు విజయవంతం. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. పరపతి పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. అదనపు ఆదాయం సమకూరి అప్పులు తీరుస్తారు. వ్యాపారులకు లాభాలు తథ్యం. భాగస్వాములతో సఖ్యత. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. రాజకీయవేత్తలకు ఊహించని ఆహ్వానాలు.  

కన్య : అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్యమైన కార్యాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. దూరమైన  ఆప్తులు తిరిగి మీ చెంతకు వస్తారు. వాహనసౌఖ్యం. ఇంటి నిర్మాణాలపై దృష్టి పెడతారు. నిరుద్యోగులకు కొంత శ్రమ. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు బాధ్యతల నుంచి విముక్తులవుతారు. పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలమైన కాలం. ప్రభుత్వం నుంచి సాయం. 

తుల : ముఖ్య కార్యాలు కొంత జాప్యం జరిగినా సజావుగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. శత్రువులు సైతం మీకు అనుకూలురుగా మారతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారులకు మరిన్ని లాభాలు. పెట్టుబడులకు లోటుండదు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయవేత్తలకు పదవీయోగ సూచనలు. 

వృశ్చికం : మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. అందరిలోనూ మీ ఆధిక్యాన్ని చాటుకుంటారు. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. ఆదాయానికి లోటు ఉండదు. గృహం, వాహనాలు కొంటారు. సాంకేతికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరతాయి. కళాకారులకు సత్కారాలు. 

ధనస్సు : కష్టం ఫలిస్తుంది. వ్యూహాలు అమలు చేసి విజయాలు సాధిస్తారు. ముఖ్య కార్యాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. కొన్ని విషయాల్లో కుటుంబంతో విభేదించినా తరువాత సర్దుబాటు చేసుకుంటారు. రాబడి ఆశాజనకం. అప్పులు తీరతాయి. వ్యాపారులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశంసలు అందుకుంటారు. కళాకారులకు సత్కారాలు, ఆకస్మిక విదేశీయానం.  

మకరం : యత్నకార్యసిద్ధి. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గతం గుర్తుకు తెచ్చుకుని ఆశ్చర్యపోతారు. భూవివాదాలు పరిష్కార దశకు చేరతాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో సత్తా నిరూపించుకుంటారు. కళాకారులకు అనుకోని అవకాశాలు. ఐటీ రంగం వారికి పురస్కారాలు. 

కుంభం : రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. ఆప్తులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. అందరిలోనూ గుర్తింపు రాగలదు. కొన్ని కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు, విస్తరణ యత్నాలు సఫలం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు. కళాకారులకు ఊహించని అవార్డులు. 

మీనం : అనుకోని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు అధికం, అయినా డబ్బు సమకూరుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురై మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ప్రయాణాలు చివరిలో వాయిదా. వ్యాపారులకు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు విధుల్లో మరిన్ని బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు. 


వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400